Monday, December 23, 2024

కారులో కూర్చున్న వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: కారులో కూర్చొని ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లిఖార్జున అనే వ్యక్తి (45) బుచ్చరెడ్డిపాలెంలో జిరాక్స్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం భోజనం కోసం వెళ్తున్ననని చెప్పి కారులో బయలుదేరాడు. గొలగమూడి రైల్వేగేటు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి చేరుకున్నాడు. కారుపై పెట్రోల్ పోసి అనంతరం అందులో కూర్చుని తనపై పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్లతో మంటలు అంటించుకున్నాడు. కారులో మంటలో రావడంతో వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేసరికి కారుతో అతడి మృతదేహం పూర్తిగా కాలిపోయింది. రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కారు మల్లిఖార్జునదిగా గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డిఎస్‌పి హరినాథ్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News