Friday, December 27, 2024

ప్రాణం తీసిన అప్పు… పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

అక్కన్నపేటః అప్పుల బాధ తాళలేక తీవ్ర మనోవేదనకు గురై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ తాండ్ర వివేక్ తెలిపిన వివరాల ప్రకారం… అక్కన్నపేట మండలం గుడాటి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి గ్రామానికి చెందిన మెడవేని చిరంజీవి(31) అనే వ్యక్తి తనకు నాలుగు లక్షలు అప్పు ఉందని మనోవేదనకు గురై బాధపడుతున్నాడు.

ఈ క్రమంలో చిరంజీవి గురువారం ఉదయం 11.30 గంటలకు ఇంటి వద్ద నుండి వ్యవసాయ బావి వద్దకు వడ్లు పట్టడానికి వెలుతున్నానని చెప్పి వెళ్లాడు. సాయంత్రం 6.30 గంటలకు చిరంజీవి బార్య అయిన లావణ్యకు వాళ్ల బావ కొడుకు పోన్ చేసి వ్యవసాయ బావి వద్ద బాబాయి పురుగుల మందు తాగిసృహ కోల్పోయాడని చెప్పగా, హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్లింది. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ తాండ్ర వివేక్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి బార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News