Wednesday, January 22, 2025

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పాల్వంచ టౌన్ : పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం… గుండాల మండలం కాచనపల్లికి చెందిన ఎరుకల లింగయ్య కుటుంబం మందెరికల పాడు గ్రామానికి సంవత్సరం క్రితం బతుకు దెరువు నిమిత్తం వలస వచ్చారు. గత కొన్ని రోజులుగా లింగయ్య (40) తాగుడుకు బానిసయ్యాడు.

దీంతో లింగయ్య భార్య శైలజ తన ముగ్గురు పిల్లలను తీసుకొని కాచనపల్లికి వెళ్లడంతో మనస్థాపానికి గురైన లింగయ్య గత నెల 15న పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకొన్నాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సబ్యులు సమాచారం ఇచ్చారు. దీనితో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లింగయ్య శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు పాల్వంచ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News