Monday, January 20, 2025

పెళ్లి ఐతలేదని వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో గురవారం విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కావడం లేదని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ (36) ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురికి తరలించారు. ఈ ఘటనతో శ్రీకాంత్ కుటుంబం శోకసంద్రంలో ముగినిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News