Monday, December 23, 2024

అత్తాపూర్‌లో యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man commits suicide by hanging in Attapur

హైదరాబాద్: రాజేంద్రనగర్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌లో యువకుడు ఆత్మహత్య శుక్రవారం చేసుకున్నాడు. క్రెడిట్‌ కార్డు రికవరీ ఏజెంట్ల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడిని దత్తాత్రేయగా గుర్తించారు. రెండేళ్లుగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసైన యువకుడు 3 క్రెడిట్‌ కార్డుల్లోని డబ్బులతో ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడాడు. వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలని వేధిస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం సూసైడ్‌ నోట్ ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News