మైలార్దేవ్పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో పరిధిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. చెరువులో దూకి శ్రీహరి (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో తన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనాతో ఇవాళ ఉదయం తల్లి రుక్మిణి(60) మరణించినట్టు వీడియోలో వెల్లడించాడు. గచ్చిబౌలిలో ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందినట్టు శ్రీహరి వెల్లడించాడు. రూ.10 లక్షలు చెల్లిస్తేనే తన తల్లి మృతదేహం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెప్పినట్టు తెలిపాడు. సరైన వైద్యం అందకనే తన తల్లి మరణించినట్టు శ్రీహరి పేర్కొన్నాడు. తన తండ్రి కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహం కోసం చెరువులో గాలిస్తున్నారు.
man commits suicide by jumping into pond in mailardevpally