Friday, November 22, 2024

యువతితో లవ్.. భార్యకు తెలియడంతో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

man commits suicide by jumping into well in hyderabad

హైదరాబాద్: ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. భార్యకు తెలవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ శివారులోని సైదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… నగరంలోని రెయిన్‌ బజార్‌కు చెందిన దీపక్ కుమార్ (18) హయత్‌ నగర్‌కు చెందిన యువతిని గత సంవత్సరం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇటీవల అతను మరో యువతి ప్రేమలో పడ్డాడు. ఈ విషయం కాస్త భార్యకు తెలియడంతో కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. మరోపక్క, ప్రియురాలు పెండ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ కుమార్ తండ్రికి ఫోన్ చేసి ఎర్రకుంట సమీపంలోని పాడుబడిన బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు చెప్పాడు. అప్రమత్తమైన తండ్రి కరణ్‌లాల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు హూటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే, అప్పటికే దీపక్ కుమార్ బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News