Monday, December 23, 2024

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోరుట్ల: కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన ఒజ్జె గంగనర్సయ్య(43) అనే వ్యక్తి అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఒజ్జె గంగనర్సయ్య గతంలో సార్లు గల్ఫ్ దేశం వెళ్లి వచ్చాడు.

గల్ఫ్ దేశంలో సరైన పనులు లేక అప్పుల పాలయ్యాడు. దీనికి తోడు అనారోగ్యంతో కొంత మతిస్థిమితం కూడా కోల్పోయినట్లు తెలిసింది. శనివారం సాయంత్రం యూసుఫ్ నగర్ గ్రామశివారులోని మర్రికుంట కట్టపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య అంజమ్మ పిర్యాదు మేరకు కోరుట్ల ఎస్‌ఐ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News