Friday, December 20, 2024

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: కుటుంబ కలహాలతో ఆనారోగ్య సమస్యలతో సతమతమవుతూ మనస్థాపం చెంది సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన నజీర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. త్రీటౌన్ సిఐ బాను ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నజీర్ గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. దీంతో పాటు తమకున్న స్థలం విషయమై కుటుంబ సభ్యులతో తగాదాలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు విషయాలతో మనస్థాపానికి గురై నజీర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ దోరికినట్లు పోలీసులు తెలిపారు.

నజీర్ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి వ్యక్తి గత సహాయకులుగా కొంత కాలం పని చేశారు. కాగా తమ భర్త మృతి పై అనుమానం ఉన్నట్లు పూర్తి స్ధాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని భార్య ఫిర్యాదులో పెర్కొందని పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ రవీందర్ గౌడ్, ఎంపిటిసి నాగుల స్రవంతి ప్రశాంత్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News