Monday, December 23, 2024

భార్య బతిమిలాడిన రాకపోవడంతో భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కాసిపేటః  కుమురం భీం అసిపాబాద్ కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ గూడెం గ్రామానికి చెందిన నేదునూరి అనిల్ (26) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకోని అత్మహత్యకు పాల్పడ్డాడు. కాసిపేట ఎస్‌ఐ గంగారం తెలిపిన వివరాల ప్రకారం…. దుబ్బగూడేం గ్రామానికి చెందిన నేదునూరి అనిల్‌కు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, ఆరు నెలలుగా భార్య భర్తల మధ్య మనస్పర్థాలు వచ్చాయి.

సెప్టెంబర్ 30న ఇంటికి రావాలని సూచించినప్పటికీ భార్య రాకపోవడంతో మంగళవారం రాత్రి అనిల్ బలవన్మరణానికి పాల్పడ్డడని ఎస్‌ఐ తెలిపారు. సంఘటనను చూసిన గ్రామానికి చెందిన అంకుస్‌తో కలిసి మృతుని తండ్రి నరసయ్య వెంటనే అనిల్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News