Monday, December 23, 2024

జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

man commits suicide in mahabubnagar Midjil mandal

 

మిడ్జిల్ : జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తూరు గ్రామానికి చెందిన భ్యాగరి నరసింహులు(56) గత కొంతకాలం క్రితం పక్షవాతం రావడంతో ఏమి పని చేయకుండా ఉండడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైయ్యాడు. దీనికితోడు అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తుండడంతో జీవితం మీద విరక్తి చెందిన శుక్రవారం రాత్రి ఇంట్లో నుండి వెళ్లిపోయి గ్రామ శివారులోని చెక్ డ్యామ్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గ్రామస్తులతో కలిసి కుటుంబ సభ్యులు నరసింహ కొరకు వెతకగా చెక్ డ్యామ్‌నుండి కొద్ది దూరంలో చెట్టుకు తట్టుకుని అతని మృతదేహం లభించింది. గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే నరసింహా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News