Monday, December 23, 2024

ప్రాణం తీసిన ట్రాఫిక్ చలాన్లు..

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: ట్రాఫిక్ చలాన్లు కట్టలేదని ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని పట్టుకెళ్లగా దీంతో మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. తన తండ్రి మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమని కుమారుడు సూర్య హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిత్రుడు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(54) వరంగల్‌లో ఓ బట్టల షాపులో సేల్స్ మెన్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మల్లారెడ్డి గ్రామం నుంచి బైకుపై వరంగల్ వెళ్లి విధులు నిర్వహించి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడు.

ఈ క్రమంలో ఆ బైక్ 9 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు నమోదయ్యాయి. ఈనెల 21న ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలో భాగంగా చలాన్లు పెండింగ్‌లో ఉండటంతో వాటిని కట్టి బైక్ తీసుకవెళ్లాలని పోలీసులు చెప్పారు. దీంతో అతను మల్లారెడ్డిపల్లికి ఆటోలో వెళ్లాడు. వాహనం లేకపోవడం వల్ల విధులకు వెళ్లలేనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు పోలీసులు వచ్చి రూ. మూడు వేలు ఇచ్చి వెళ్లారని బంధువులు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News