Monday, December 23, 2024

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి టౌన్ : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ శివారులోని బిసి వెల్ఫేర్ గురుకుల పాఠశాల వెనుక భాగంలోని ఖాళీ స్థలంలోని వేప చెట్టుకు 40 ఏళ్ల వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం … గురువారం కల్వకుర్తి పట్టణ శివారులోని వేప చెట్టుకు వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అటుగా వెళ్లున్న వారి ద్వారా సమాచారం అందిందని, వెంటనే సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై రమేష్ తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తు పడితే కల్వకుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News