Wednesday, December 25, 2024

వైన్స్ లలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: వైన్స్ లలో కింగ్ ఫిషర్(కేఎఫ్) బీర్లు అందుబాటులో ఉంచడం లేదని ఓ మందు ప్రియుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రానికి చెందిన బీరం రాజేష్.. వైన్స్ లలో కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉంచడం లేదని ఐడివోసిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. జిల్లాలోని కోరుట్ల, ధర్మపురిలలో అన్ని రకాల బ్రాండ్ బీర్లు అమ్ముతుంటే జగిత్యాలలో మాత్రం సిండికేట్ గా మారి నాసి రకం బీర్లు అంటగడుతున్నారని ఆరోపించాడు. ఇవి త్రాగిన ప్రజలు యూరిక్ ఆసిడ్ వంటి రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఊరూరా బెల్ట్ షాపులు వెలిసి వాటి ద్వారా నకిలీ మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డాడు. స్పందించిన అదనపు కలెక్టర్ బి ఎస్ లత ఎక్సైజ్ సూరింటెండెంట్ తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించినట్టు వివరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News