Wednesday, January 22, 2025

వైరల్ వీడియో: ఆటోరిక్షాను కారుగా మార్చిన యువకుడు

- Advertisement -
- Advertisement -

కన్వర్టబుల్ కారులాగా మార్చబడిన ఆటోరిక్షా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పింక్ పెయింట్ చేయబడిన వాహనం, ఒక బటన్ నొక్కినప్పుడు వెనుకకు ముడుచుకునే పైకప్పును కలిగి ఉంది. సీట్లు కూడా గులాబీ రంగులో ఉన్నాయి. ఈ వీడియోను ఆటోరిక్షా కేరళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నెట్టింట్లో వైరల్ అయిన ఈ వీడియోను 1 మిలియన్లకు పైగా వీక్షించారు. చాలా మంది వినియోగదారులు వాహనం ప్రత్యేకమైన డిజైన్‌ను మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేసారు. ఒక వినియోగదారు దీనిని “రోల్స్ రాయిస్ ఆఫ్ ఆటోస్” అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News