Thursday, December 19, 2024

బ్రిటన్‌లో దోషికి శిక్ష..భారత్ జైల్లో కొనసాగింపు !

- Advertisement -
- Advertisement -

ఓ హత్య కేసులో దోషిగా తేలి , బ్రిటన్‌లో శిక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తికి మిగిలిన శిక్ష భారత్‌లో కొనసాగనుంది. ఈమేరకు ఇరు దేశాల మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది. దీంతో అతడిని స్వగ్రామమైన గుజరాత్‌కు తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ లోని వల్సాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బ్రిటన్‌లో ఉండేవాడు. కొన్నేళ్ల క్రితం తనకు ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆమెను దారుణంగా హత్య చేశాడు. 2020లో ఈ కేసు విచారణ చేపట్టిన బ్రిటన్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. నేరస్థుడికి 28 ఏళ్లు జైలు శిక్షను విధించింది.

ఇప్పటివరకు అతడు అక్కడి కారాగారంలో శిక్ష అనుభవించాడు. ఈ క్రమం లోనే మిగతా శిక్ష స్వదేశంలో అనుభవించేలా అతడిని పంపించాలంటూ తల్లిదండ్రులు భారత ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై భారత్‌బ్రిటన్ మధ్య చర్చలు జరిగాయి. మిగిలిన శిక్షను స్వదేశంలో అనుభవించేందుకు బ్రిటన్ అంగీకరించింది. దీనిపై ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అతడిని భారత్‌కు తీసుకొచ్చిన అధికారులు ,… గుజరాత్ లోని లాజ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News