- Advertisement -
నల్లగొండ: యువకుడు యువతి గొంతు కోసిన సంఘటన నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం రాజీవ్‌నగర్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాల సైదులు అనే యువకుడు గత కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తనకు ప్రేమించే ఉద్దేశం లేదని పలుమార్లు యువకుడికి యువతి చెప్పింది. ఈ మధ్యలో అమ్మాయికి పెళ్లి కుదురింది. తనని పెళ్లి చేసుకోకుండా మరోకరును పెళ్లి చేసుకోవడంతో ఆమెను చంపాలని బాలసైదులు నిర్ణయం తీసుకున్నాడు. ఒంటరిగా వెళ్తున్న యువతిపై బాలసైదులు బ్లేడ్లతో దాడి చేశాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి బాల సైదులు కోసం గాలిస్తున్నారు.
- Advertisement -