Friday, November 22, 2024

కొడుకు కోసం 300 కిలో మీటర్లు సైకిల్ తొక్కిన తండ్రి

- Advertisement -
- Advertisement -

man cycles 300 km to get medicines for son in Karnataka

బెంగళూరు: తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలను కాపాడటానికి ఏదైనా చేస్తారు…ఎంతకైనా తెగిస్తారు. ఒక తండ్రి తన కొడుకుకు మందులు కోసం 300 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూర్‌లోని కొప్పలు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న 45 ఏళ్ల వ్యక్తి (ఆనంద్) తన కొడుకు ఔషధాల కోసం మూడు వందల కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించాడు. తారసిపూర్ తాలూకాలోని బన్నూర్నుండి బెంగళూరు వరకు మూడు రోజులు సైకిల్ తొక్కాడు. బాలుడు చిన్నప్పటి నుంచీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గత 10 సంవత్సరాలుగా బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్) వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు.

అతని తండ్రి ఔషధాలు కొనడానికి ప్రతి రెండు నెలలకోసారి ఆసుపత్రికి వెళ్లేవారు. కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా తండ్రి మందులు తీసుకురావడానికి బెంగళూరుకు వెళ్లలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే సైకిల్ పై మందులు కొనడానికి ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మే 23 న గణిగానకోప్పల్ నుంచి బయలుదేరి మందులతో మే 26 న ఇంటికి తిరిగి వచ్చాడు. బాలుడికి 18 ఏళ్లు వచ్చేలోపు మందులు ఆపివేస్తే మూర్ఛ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారని, తాను అందుకే సైకిల్‌పై ప్రయాణం చేయాల్సివచ్చిందన్నాడు ఆనంద్. కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కర్నాటక ప్రస్తుతం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

man cycles 300 km to get medicines for son in Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News