Sunday, January 19, 2025

ఆస్తి వివాదంలో వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలలో మొదలైన గొడవ చివరకు ఓ ప్రాణం బలితీసుకుంది. షమాకాలనీకి చెందిన అబ్దుల్లా , జాబెర్ కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయమై గొడవలు జరుగుతున్నాయి. ముగ్గురు అన్నదమ్ములలో ఒకరు దుబాయి లో ఉంటున్నారు. కాగా ఆస్తి పంపకాల విషయమై జాబెర్,అబ్దుల్లాలు ఘర్షణ పడ్డారు. పరస్పరం ఇటుకలు , రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అబ్దుల్లా మృతి చెందగా , జాబెర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో అడ్డు వచ్చిన గర్భిణీ ్రస్రీ సైతం గాయాల పాలైంది. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News