Monday, December 23, 2024

పెద్దాయనతో స్నేహం…. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

- Advertisement -
- Advertisement -

అమరావతి: వయసులో పెద్దాయనతో స్నేహం చేసి అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆ యువకుడు పెద్దాయనను హత్య చేసి తొమ్మిది నెలల తరువాత పోలీసులకు దొరికిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ఆరిలోవ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీనివాస్ రావు(43) తన కుటుంబ సభ్యులతో కలిసి ఎండాడలో ఉండేవారు. శ్రీనివాస్ రావుకు సూరాడ లక్ష్మణ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి కల్లు తాగిన తరువాత భోజనం కోసం శ్రీనివాస్ తన ఇంటికి లక్ష్మణ్ తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ భార్యతో లక్ష్మణ్ పరిచయం పెంచుకున్నాడు. పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వివాహేతర సంబంధం బయటపడడంతో వారిని శ్రీనివాస్ మందలించాడు. ఈ క్రమంలో వివాహేతర సంబంధం కొనిసాగిస్తుండడంతో రైల్వే న్యూ కాలనీకి శ్రీనివాస్ రావు మకాం మార్చాడు.

ఆన్‌లైన్ ఫుడ్ డెలవరీ బాయ్‌గా పని చేస్తున్న లక్ష్మణ్ అడ్రస్ తెలుసుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 2021 ఏప్రిల్ 21 నమ్మించి శ్రీనివాస్ రావును లక్ష్మణ్ బీచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ శ్రీనివాస్ రావు తలపై ఇటుకతో బలంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. శ్రీనివాస్ రావు అక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడు శ్రీనివాస్ రావుగా గుర్తించారు. అదే రోజు లక్ష్మణ్ చిన్నితో కలిసి విజయవాడ పారిపోయారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. తొమ్మిది నెలల తరువాత చిన్ని లక్ష్మణ్ కిరాయి ఇంటికి వచ్చి ఇల్లు సర్దుతుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశామని లక్ష్మణ్ ఒప్పుకున్నాడు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News