మన తెలంగాణ/వనస్థలిపురం : అక్రమ సంబంధం వద్దని హెచ్చరించినందుకు ఇరువురు కలసి ఓవ్యక్తిని హత్య చేసి చెట్ల పొదల్లో దుప్పట్ల్లో కప్పి పడేసిన సంఘటనలో ఇరువురి నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా. వేములపల్లి మండలం. బోమ్మకల్ గ్రామానికి చెందిన కొమ్ము ప్రియాంక అలియాస్ దీప్తి, వ యస్సు (27) సంవత్సరాలు ఈమెకు గతంలో నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తితో పెండ్లి అయింది. అతనితో విడాకులు తీసుకొని సూర్యపేట చర్చికౌంపౌడ్‌కు చెందిన ఉదయ్ కుమార్‌తో పెండ్లి ఆయింది. ఉదయ్ కుమార్ నగరానికి వచ్చి ఉద్యోగం కోసం వెతుకుతుండగా కరోనాతో చనిపోయాడు. ఉదయ్ కుమార్ సేహ్నితుడైన శ్రీనివాస్‌తో దీప్తి కి పరిచయం అయింది. ఈ పరిచయంతో ఇరువురు ఒక్కటయ్యారు. దీంతో ప్రియాంక నగరానికి వచ్చి వనస్థలిపురం కమలానగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సర్వర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నది.
అప్పుడప్పుడు సూర్యపేట నుంచి శ్రీనివాస్ వస్తూపోతుండే వాడు ఇంటి యజమానికి అనుమానం వచ్చి శ్రీనివాస్ ఎవరు అని ప్రశించగా సోదరుడని, సాయికుమార్ నా భర్త అని ఇంటి యజమానికి పరిచయం దీప్తి చేసింది. వ్యవహారం ఇలా కొద్ది రోజులు నడుస్త్తుండగా ఒకరోజు ఇంట్లో సాయికుమార్ ఉన్న సమయంలో సూర్యపేట నుండి శ్రీనివాస్ దీప్తి ఇంటికి వచ్చాడు. ఇంట్లో దీప్తి సాయికుమార్ ఉండగా శ్రీనివాస్ ఇతను ఎవరని దీప్తిని ప్రశ్నించాడు. దీంతో శ్రీనివాస్‌కు, సాయికుమార్‌కు మధ్య ఘర్షణ జరిగింది. సాయికుమార్ దీప్తిలు కలసి ఇంట్లో ఉన్న రోకలి బండతో శ్రీనివాస్ తలపై కొట్టి చంపారు. శ్రీనివాస్ చనిపోయాడని గుర్తించిన దీప్తి, సాయికుమార్‌లు శ్రీనివాస్ మృతదేహన్ని దుప్పట్లో కప్పి వైదేయినగర్ పరిసర ప్రాంతాలలో చెట్లపొదలో పడవేశారు. చనిపోయిన శ్రీనివాస్ మృతదేహం దగ్గర లభించిన ఎటియం కార్డు ద్వారా క్యూపిలాగిన వనస్థలిపురం పోలీసులు శ్రీనివాస్‌ను చంపింది దీప్తి, సాయికుమార్‌లు అని గుర్తించి నిందితులను వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారయణ అరెస్టు రిమాండ్‌కు తరలించారు. అక్రమ సంబంధమే శ్రీనివాస్ హత్యకు దారి తీసిందని పోలీసులు తెలిపారు.