Wednesday, January 22, 2025

పాముతో ఫోటో దిగాడు… కాటేసింది… మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ యువకుడు పాము మెడలో వేసుకొని ఫోటో దిగాలనుకున్నాడు. పాము కాటేయడంతో యువకుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బొద్ది కూరపాడు గ్రామానికి చెందిన మణికంఠ రెడ్డి(23) కందుకూరు ఆర్‌టిసి డిపో సమీపంలో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నాడు. పాములు ఆడించే వెంకటస్వామి అనే వ్యక్తి మణికంఠ దుకాణానికి వచ్చాడు. వెంకట స్వామిని అడిగి పామును మెడలో వేసుకొని మణికంఠ ఫోటోలు దిగాడు. మెడలో నుంచి పాము కిందపడడంతో పైకి లాగడానికి ప్రయత్నించాడు. పాము చేతిపై కాటు వేయడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఒంగోలులోని రిమ్స్‌కు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మణికంఠ చనిపోయాడు. కుమారుడు చనిపోవడంతో మణికంఠ రెడ్డి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మణికంఠ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంకటస్వామిపై జంతు హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News