Wednesday, January 22, 2025

విమానంలో సీటు పక్కనే మల విసర్జన: ప్రయాణికుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఫ్లోర్ పైనే మల విసర్జన చేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఎఐసి 866 విమానంలో జూన్ 24న జరిగినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.

సీట్ నంబర్ 17ఎఫ్‌లో ప్రయాణిస్తున్న రాం సింగ్ అనే ప్రయాణికుడు 9వ వరుసలో మలవిసర్జన, మూత్ర విసర్జనతోపాటు ఉమ్మి వేసినట్లు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ అసభ్య ప్రవర్తనను గమనించిన వెంటనే విమాన సిబ్బంది ఆ ప్రయాణికుడిని మందలించడంతోపాటు మిగతా ప్రయాణికులకు దూరంగా కూర్చోపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

పరిస్థితిని సిబ్బంది విమాన పైలట్‌కు తెలియచేసిన వెంటనే ఆయన విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారని, విమానం దిగిన వెంటనే ఆ ప్రయాణికుడిని సెక్యూరిటీ అదుపులోకి తీసుకుందని వారు చెప్పా౩రు. ఆ ప్రయాణికుడి ప్రవర్తనతో పలువురు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఢిలీ విమానాశ్రయంలో రాంసింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఐపిసిలోని 294, 510 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News