Wednesday, December 25, 2024

జోగిపేటలో పండగపూట విషాదం.. ప్రాణం తీసిన పతంగులు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సంక్రాంతి పండగ పూట విషాదం నెలకొంది. పతంగులు ఎగురవేస్తుండగా ప్రమాదం సంభవించింది. విద్యుత్ తీగలు తగిలి భర్త మృతిచెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పతంగులు తీస్తుండగా కిందపడి సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని పతంగులు ఎగురవేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News