Tuesday, December 3, 2024

రైలు ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

సిర్పూర్ టిః రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం 7.30 గంటలకు ముందు గాదం భీమయ్య (53) తన తమ్ముడి కుమారుని నిశ్చితార్థానికి కాశిపల్లె గ్రామానికి వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి రాగా తన బర్రె ఇంట్లో లేదు. పొద్దున వరకు వస్తుంది అనుకోని పడుకున్నాడు. ఉదయం 4 గంటలకు  మేల్కోనేసరికి ఇంటికి బర్రె రాలేదు.

దీంతో బర్రెను వెతుక్కుంటూ తన గొల్లవాడ సమీపంలో గల చీలపల్లి రైల్వే అండర్ బ్రిడ్జికి సమీపంలో గల రైలు పట్టాలు దాటుతుండగా బల్లార్ష నుండి మంచిర్యాల వైపు వెళ్లే రైలుబండి తగిలి మృతి చెందినట్లు తెలిపారు. రైల్వే హడ్‌కానిస్టేబుల్ సురేష్‌గౌడ్ ఇన్వేస్టిగేషన్ చేస్తూ మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం మృతుని భార్య అయిన గాదం లక్ష్మికి అప్పగించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఒక కుతురు ఉంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News