Monday, December 23, 2024

కూతురు ఇంటికి వెళ్తూ.. అనంతలోకాలకు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రైలు ఎక్కుతుండగా కిందపడి వ్యక్తి మృతి చెందాడు. జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడిని ఇల్లందుకుంట మండలం పాతర్లపల్లి చెందిన రామ్ సమ్మయ్యగా గుర్తించారు. మందమర్రిలోని కూతురు ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కుప్పకూలిపోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News