Wednesday, January 22, 2025

బిల్డింగ్ పై నుంచి జారి పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: అపార్టుమెంట్ నుంచి జారి పడి ఓ వ్యక్తి మరణించిన సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి… దోమలగూడ అరవిందా రెసిడెన్సీలో ఐదో అంతస్తులో రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ మోసాలి కేశవరెడ్డి (87) నివసిస్తున్నారు. రెండు నెలల క్రిత అమెరికాలో ఉన్న కుమార్తె కొండేటి నిరంజనీ తన కుమారుడితో కలిసి ఇండియాకు వచ్చారు. మంగళవారం ఇంట్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా, డాక్టర్ కేశవరెడ్డి టెర్రాస్ పై నుంచి కింద పడినట్టుగా వాచ్‌మెన్ వచ్చి కుమార్తెకు సమాచారం ఇచ్చారు.

అప్పటికే కేశవరెడ్డి మరణించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా, కేశవరెడ్డి గత కొన్నాళ్లుగా సైక్రియాటిక్ డిజార్డ్‌తో బాధపడుతూ మందులు వినియోగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, మా తండ్రి మరణానికి ఎవరూ కారకులు కాదనీ, పొరపాటున బిల్డింగ్ పైనుంచి జారి పడిన కారణంగానే మా తండ్రి మరణించినట్టు కుమార్తె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News