Wednesday, January 22, 2025

చికెన్ కర్రీ గిన్నెలో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఓ వ్యక్తి చికెన్ కర్రీ గిన్నెలో పడి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కుక్కింద్ గ్రామానికి చెందిన మల్లేశం అనే వ్యక్తి ధరూర్ మండల కేంద్రంలో జరుగుతున్న బిఆర్‌ఎస్ మీటింగ్‌కు వచ్చాడు. మే2న మల్లేశం అదుపుతప్పి చికెన్ కర్రీ గిన్నెలో పడిపోయాడు. వెంటనే బిఆర్‌ఎస్ కార్యకర్తలు అతడిని గిన్నెలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మృతుడి సోదరుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News