Thursday, January 23, 2025

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హత్నూర : చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన హత్నూర మండలం పన్యాల గ్రామ పరిధిలోని మంజీరా నది చెక్ డాం వద్ద సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హత్నూర గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ (59) సోమవారం పన్యాల గ్రామ పరిధిలోని మంజీరా నది చెక్ డాంలో చేపలు పట్టడానికి వెళ్లాడు. చేపల పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నీట మునిగిన వ్యక్తి కోసం సుమారుగా రెండు గంటల పాటు గాలించగా మృతదేహం లభ్యమయింది. మృతుడి భార్య కొన్నేళ్ల క్రితం చనిపోగా వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News