Sunday, December 22, 2024

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

నవాబ్‌పేట్: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌కుమార్ తెలిపిక కథనం ప్రకారం వివరాలీలా ఉన్నాయి. మండల పరిధిలోని పులుమామిడి గ్రామానికి చెందిన దయాకర్‌రెడ్డి(45) తన ట్రాక్టర్‌తో వ్యవసాయం పొలం దున్నడానికి వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న గుంతలో ప్రమాదవాశత్తు పడి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్నా దయాకర్‌రెడ్డి దాన్ని కింద పడిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేస్ నమోద్ చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ భరత్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News