Sunday, January 19, 2025

రైలు ఢీ కొని వ్యక్తి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

 

రాజేంద్రనగర్ వట్టెపల్లి  రైల్వే గేటు వద్ద  ప్రమాదం చోటు చేసుకుంది. ఫరీద్ అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున తన ద్విచక్రవాహనంపై రైల్వే బ్రిడ్జ్ క్రాస్ చేస్తుండగా రైలు ఢీ కొట్టింది. దీంతో రైలు చక్రాల కింద నలిగి ఫరీద్ శరీరం రెండుముక్కలైంది. అయితే రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే ఫరీద్ మృతి చెందాడని స్థానికుల ఆరోపించారు. ఫరీద్ కు భార్య, రెండు నెలల కుమారుడు ఉన్నారు. ఫరీద్ బంధువులు వట్టేపల్లి రైల్వే గేటు వద్దకు చేరుకుని గ్యాంగ్ మెన్ పై దాడికి యత్నించారు.

తన నిర్లక్ష్యంతోనే ఫరీద్ ప్రాణాలు కొల్పోయాడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైల్వే గేటు వద్ద బైఠాయించి గ్యాంగ్ మెన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మూడు గంటల పాటు నిరసన‌ చేపట్టడతో ఘటన స్థలానికి మైలార్ దేవిపల్లి పోలీసులు చేరుకుని నిరసన కారులను సముదాయించారు. త్వరగా బ్రిడ్జ్ నిర్మాణాల పనులు పూర్తి చేయాలని, విద్యార్దులు, మహిళలు, వృద్దులు రైల్వే బ్రిడ్జ్ క్రాస్ చేసి రావాల్సి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News