Thursday, January 16, 2025

భర్త ఆఖరి చూపుకు నోచుకొని భార్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భర్త చనిపోతే భార్య చివరి చూపుకు నోచుకొని విషాధ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా తలసముద్రం గ్రామానికి చెందిన బొంతుల సురేష్ ఈ నెల 15న దేవాది వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సురేష్ వద్ద ఫోన్ లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయారు. మూడు రోజులు ఎదురు చూసిన స్థానికులు సురేష్ మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే సురేష్ భార్య ఈ నెల 12 న పుట్టింటికి వెళ్లింది.

పుట్టింటికి వెళ్లిన భార్య శివమోహిని సోమవారం తల సముద్రం వచ్చింది. ఇంటికి వెళ్లిన భార్యకు భర్త కనిపించపోవడంతో చుట్టు పక్కల వాళ్లను అడిగి తెలుసుకుంది.దీంతో దేవాది వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలిసింది. దీంతో శివమోహని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. భార్య శివమోహిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు. అయితే మృతదేహం ఖననం చేయడంతో భర్త చివరి చూపు కూడా దక్కలేదని ఆవేధన చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News