Monday, December 23, 2024

బైక్ ను ఢీకొట్టిన కారు.. షేక్ పేట్ ఫ్లైఓవర్ పై నుంచి కిందపడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

Man died in Road Accident in Hyderabad

హైదరాబాద్: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. శుక్రవారం రాత్రి షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఓ బైక్ ను వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న యువకుడు బ్రిడ్జి పైనుంచి కిందపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరణించిన యువకుడిని కర్నూల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రీతమ్ భరద్వాజ్ గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Man died in Road Accident in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News