Thursday, December 26, 2024

కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కోహిర్: మండల పరిధిలోని దిగ్వాల్ గ్రామం నుంచి కావేలి గ్రామానికి సైకిల్ పై వెళ్లే క్రమంలో జహీరాబాద్ నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తున్న ఒక కారు సైకిల్ పై ప్రార్ధిస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో కెజిఎన్ గార్డెన్స్ సమీపంలో ఒక వ్యక్తికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇదే విషయమై కొహీర్ సబ్ ఇన్స్ పెక్టర్ సురేష్ ని సంప్రదించగా వారు తెలిపిన వివరాల ప్రకారం దిగ్వాల్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఇబ్రహీం 58 సం రాలు దిగ్వాల్ గ్రామం నుంచి కావేలి వైపు ప్రయాణించే క్రమంలో జహీరాబాద్ వైపు నుంచి వస్తున్న కారు సైకిల్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇబ్రహీంకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాద ఘటన విషయాన్ని తెలుసుకొని మృతి చెందిన ఇబ్రహీం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు సబ్ ఇన్స్ పెక్టర్ సురేష్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News