Monday, December 23, 2024

యాదాద్రిలో వ్యక్తిపై పారతో దాడి… స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కాపురం గ్రామంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య గత మూడు రోజుల క్రితం తలెత్తిన వివాదం చావుకి దారి తీసింది. ఈ దాడిలో గుంటి బసవయ్య (65) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం… భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామంలో నివాసముంటున్న గుంటి బసవయ్య, రాసాల రాజమల్లు ఇద్దరికి గత మూడు రోజుల క్రితం వీరి మధ్య వివాదం చెలరేగింది. వాదన పెరిగి పరస్పరం ఒకరి పై మరొకరు దురుసుగా ప్రవర్తించి తిట్టుకోవడం, దాడులు చేసుకున్నారు.

ఐతే తాజాగా గురువారం ఉదయం గుంటి బసవయ్య ఇంటి వద్ద కంకర ఎత్తుతున్న క్రమంలో రాసాల రాజమల్లు తన చేతికి అందిన పారతో బసవయ్య తలపై బలంగా మోదాడు. దీంతో బసవయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా బసవయ్య భార్య తిరుపతమ్మ అడ్డుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో ఆమెకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన తిరుపతమ్మను ఆసుపత్రికి పంపించి, అక్కడే ఉన్న బసవయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న భువనగిరి రూరల్ ఎస్ఐ సంతోష్ కుమార్ నిందితుడిని విచారిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News