Saturday, December 21, 2024

కోతులతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించి లోయలో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

 

కోతులతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్నది. అబ్దుల్‌ షేక్‌ అనే వ్యక్తి తన కారులో పుణె జిల్లా భోర్‌ నుంచి కొంకణ్‌ వెళ్తుండగా. మార్గం మధ్యంలో కోతులు గుంపుగా కనిపించడంతో వరందా ఘాట్‌ రోడ్‌లో ఉన్న వాఘ్‌జాయ్‌ గుడి వద్ద కారును ఆపి కోతులతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు.
వాటితో పాటు తను కూడా ఫోటో దిగాలనే యత్నంలో కొండ పైనుంచి జారి లోయలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో లోయలో 500 మీటర్ల దిగువన అతని మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సహాయంతో అతడిని వెళికితీసి ఆసుపత్రకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News