Monday, December 23, 2024

సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి బోనాల ఉత్సవాలు చూసేందుకు భారీగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో బేగంబజార్ నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చి ఆకాష్ సింగ్ అనే యువకుడు రాత్రి కరెంట్ స్తంభం తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అమ్మవారి దర్శనానికి వెళ్లిన యువకుడు మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News