Monday, January 20, 2025

అనంతపురంలో భారీ పేలుడు..

- Advertisement -
- Advertisement -

అనంతపురం :అనంతపురం పట్టణంలో ఇవాళ ఆర్టీవో కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పట్టణంలోని శ్రీ బాలాజీ స్టిక్కర్స్ ప్రేయర్స్ దుకాణంలో పదేళ్ల కిందటి పెయింటింగ్ డబ్బాలను ఓపెన్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సతీష్ అనే వ్యక్తి మరణించాడు.

సతీష్ ఆ దుకాణంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. పేలుడు దాటికి సతీష్ శరీరం ముక్కలు ముక్కలై దాదాపుగా 40 అడగుల దూరంలో పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News