Friday, December 20, 2024

ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ఆటో బోల్తా పడి ఓ వ్యక్తి చెందిన సంఘటన శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీరంగూడ లో నివాసముండే బోయ ఈశ్వర్ బండలను వేసే వృత్తి నిర్వహిస్తున్నాడు. కాగా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామంలో పని ఉండడంతో తన వద్ద పనిచేసే మద్దిలేటి, హరికృష్ణ, ఆచారి బ్రహ్మయ్య, వంశీకృష్ణ నలుగురు ఆటోలో రావల్ కోల్ కు వెళ్తున్నారు. ఆటోను బ్రహ్మయ్య నడుపుతున్నాడు.

రావణ్ కోల్ గ్రామం సమీపంకు చేరుకోగా ఆటోను అతివేగంగా నడపడంతో ఆటో పల్టీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News