Sunday, December 22, 2024

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

ఫరూఖ్‌నగర్ ః చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం, ఎలికట్టలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేందర్‌కుమార్ వర్మ, ధర్మేంధర్‌వర్మ గత కొంతకాలంగా ఎలికట్టలో ఇంటిని అద్దెకు తీసుకొని రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 8వ తేదీన వారి కూలి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజన సమయానికి చికెన్ వంటకాన్ని, పూరీలు తయారు చేసుకున్నారు.

మద్యం సేవిస్తూ చికెన్ పూరీలను తింటుండగా జితేందర్‌కుమార్ వర్మ (46) ఒక్కసారిగా కింద పడిపోయాడు. గమనించిన ధర్మేందర్ ఎంతలేపినా జితేందర్‌కుమార్ వర్మ ఉలుకూపలుకు లేకపోవడంలో ఇరుగుపొరుగు వారు వచ్చిచూడగా చనిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో వివరాలు సేకరించి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. శవపరీక్షల్లో జితేందర్‌కుమార్ వర్మ గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడం వల్లే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News