Wednesday, January 8, 2025

పొరపాటున మహిళను తగిలిన వ్యక్తి.. మృతి

- Advertisement -
- Advertisement -

దేశ ఆర్థిక రాజధాని ముంబై రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో నడుచుకుంటూ వెళ్లే క్రమంలో దినేశ్ రాథోర్‌ అనే వ్యక్తి, పొరపాటున ఓ మహిళకు తగిలాడు. దీంతో దినేశ్‌పై సదరు మహిళ గొడువకు దిగింది. మహిళతోపాటు ఆమె భర్త కూడా దాడి చేశాడు.

భార్యభర్తలు ఇద్దరు దినేశ్‌పై దాడి చేస్తూ కొట్టడంతో.. అతను అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. అదే సమయంలో ట్రాక్ పైకి వచ్చిన లోకల్ ట్రైన్, దినేశ్‌పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు దంపతులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News