Monday, January 20, 2025

స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: మిత్రులతో కలిసి సిమ్మింగ్‌ఫూల్‌లో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీ సుస్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుషాయిగూడ సైనిక్‌పురి ఆఫీసర్స్ కాలనీకి చెందిన పుడత రవి (58) ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ హెచ్‌పిసిఎల్‌లో ఉద్యో గం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

శనివారం మృతుడి జన్మదినం జరుపుకోని ఆదివారం మిత్రులతో కలిసి కొండాపూర్‌లోని హెచ్‌ఎండిఏ లేఔవుట్‌లో దావత్ చేసుకొని అనంతరం సమీపంలో ని పోచిరెడ్డి వ్యవసాయ పొలంలో ఉన్న సిమ్మింగ్‌పూల్‌లో మిత్రులు ఈత కొడుతుండగా రవి నీటిలోకి దూకి మునిగిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మిత్రుల హుటాహుటిన ఘట్‌కేసర్ కమ్యూనిటీ హస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ఈ మేర కు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని సిఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News