Wednesday, February 12, 2025

బయోడైవర్సీటీ ఫ్లైఓవర్ పై నుంచి పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమావారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని కాకినాడకు చెందిన సుబ్బారావు(38) మోటార్‌సైకిల్‌పై టిఫిన్ అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం 5.30 గంటలకు ఇంటిని బయలుదేరాడు.

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పై నుంచిఫ్లైఓవర్ నుంచి కిందపడి మృతిచెందాడు. ప్రమాదవశాత్తు ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడ్డాడా, లేక వెనుక నుంచి ఎదైనా వాహనం ఢీకొట్టి వెళ్లిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రాయదుర్గం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News