Sunday, December 22, 2024

చేపలు పట్టేందుకు వెళ్ళి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

దౌల్తాబాద్‌ః చేపలు పట్టేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఎస్సై రమేష్‌కుమార్ అందించిన వివరాల మేరకు మండలంలోని ఈర్లపల్లికి చెందిన ఎండి మహమ్ముద్( 45) చేపలు పట్టేందుకు గ్రామ శివారులోని యాతలగడ్డ బావి వద్దకు కూమారుడు లాల్‌సాబ్‌తో వెళ్ళాడు.

చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడ్డాడు. కూమారుడు లాల్‌సాబ్ గమనించి గ్రామస్థులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చెపట్టారు. ప్రత్యేక్ష సాక్షి మృతుడి కూమారుడు లాల్‌సాడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తూ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News