Monday, December 23, 2024

చిట్లపల్లి వాగు వద్ద వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

కొడంగల్: వారం రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళి పోయిన వ్యక్తి చిట్లపల్లి వాగు దగ్గర మృతి చెందిన సంఘటన చిట్లపల్లి లో చోటుచేసుకుంది. ఎస్సై రవి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన సురేష్ (55) మద్యానికి బానిసయ్యాడు. ఇతను గత వారం రోజుల క్రితం ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు సురేష్ కొరకు బంధు మిత్రులు, తెలిసిన వారి దగ్గర వెతికారు. కాని ఆచూకీ తెలియలేదు.

సోమవారం చిట్లపల్లి వాగు దగ్గర కుళ్ళిన స్థితిలో శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమా చారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు సహకారంతో శవ పంచనామాను నిర్వహించారు. మృతి చెందిన వ్య క్తిని చిట్లపల్లి గ్రామానికి చెందిన సురేష్‌గా గుర్తించి కుటుంబస భ్యులకు సమాచారం అందించారు. చిట్లపల్లి గ్రామ వీఆర్‌ఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News