Monday, December 23, 2024

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: మండలంలోని జూకల్ గ్రామంలో విద్యుత్‌షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధర్‌కుమార్ తెలిపిన వివరాల ప్ర కారం… జూకల్ గ్రామానికి చెందిన కేశంపేట నరేష్ (34) తండ్రి చిన్నపల్లి వృత్తి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జూకల్ గ్రా మంలో ఆదివారం కురిసిన వర్షానికి నరేష్ ఇల్లు కురుస్తుందని ఇంటి పైన ప్లాస్టిక్ కవర్ పైకప్పును కప్పడానికి ఇంటి పక్కనే ఉన్న టెలిఫోన్ స్తంభం సహాయంతో ఇంటి పైకి ఎక్కడానికి ప్రయత్నించగా స్తంభానికి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ఇంటిపై నుంచి కింద పడి మృతి చెందాడు. కేశంపేట కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు లు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News