- Advertisement -
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం లో పనిచేసే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. భవనం పైనుంచి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -