Wednesday, January 22, 2025

ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

బెజ్జంకి: ఫోన్ చార్జింగ్‌పెడుతూ విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గాగ్గిల్లాపూర్ గ్రామ శివారులో కావేరి సీడ్స్ కంపెనీలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన మెట్టు పర్శరాములు మండలంలోని గాగిళ్లపూర్ గ్రామ శివారులోని కావేరిసీడ్స్ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా గత 4 సంవత్సరాలుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం రాత్రి ఇంటి వద్ద నుంచి రాత్రి సమయంలో వచ్చి డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందాడని మృతుని భార్య మెట్టు లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News