Saturday, December 21, 2024

ఫైనాన్స్ వేధింపులకు వ్యక్తి బలి

- Advertisement -
- Advertisement -

Man dies due to financial harassment

ఆత్మహత్య చేసుకున్న బాధితుడు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్: ఫైనాన్స్ వేధింపులను తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న నిజాముద్దిన్ రెండు బ్యాంక్‌ల నుంచి ఈఎంఐ పద్ధతిలో రెండు ఫోన్లను కొనుగోలు చేశాడు. నెల నెల వాయిదాలు చెల్లించగా రూ.4వేలు బాకీ ఉంది. దీనిని వెంటనే చెల్లించాలని ఫైనాన్స్ ఏజెంట్లు నిజాముద్దిన్ ఇంటికి నిత్యం వచ్చి వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్థాపం చెందిన నిజాముద్దని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వెంటనే బాధితుడి ఇంటికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News