Monday, December 23, 2024

గ్యాస్ సిలిండర్ లీకై వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీకై వ్యక్తి మృతి చెందిన సంఘటనా ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం దమ్మాయి గూెడంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల తెలిపిన కథనం ప్రకారం..దమ్మాయి గూడెంకు చెందిన సుధాగాని ప్రసాద్ ,సుజిత ఇద్దరు భార్యభర్తలు. వీరికి ఒక బాబు,పాప ఉన్నారు. ప్రసాద్ స్థానికంగా ఎలక్ట్రిషన్ గా పని చేస్తున్నాడు. తాజాగా ప్రసాద్ కు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో ప్రసాద్ ఇంటి వద్దనే ఉంటున్నాడు.

సోమవారం భార్య పనికి వెళ్లగా ప్రసాద్ వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ఎరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News